'టీబీ నిర్మూలనకు 100 రోజుల కార్యాచరణ'
WNP: జిల్లాలో 1,053 టీబీ కేసులను గుర్తించినట్లు డీఎంహెచ్వో డా. సాయినాథ్ రెడ్డి తెలిపారు. 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ 100% నయమవుతుందని పేర్కొన్నారు. రోగులకు నెలకు రూ.1000 చొప్పున 6 నెలల పాటు ఆర్థిక సాయం అందిస్తామని, నేటి నుంచి 100 రోజుల పాటు ప్రత్యేక అవగాహన ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు.