భగీరథ మహర్షికి నివాళులు అర్పించిన కలెక్టర్
ప్రకాశం: భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని గురువారం ఒంగోలులోని కేశవ స్వామి పేటలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు పలు సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ, గంగను దివి నుండి భూమికి దింపిన మహనీయుడు భగీరథుడని, ఆయన పట్టుదలను త్యాగాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.