తెలంగాణ భవన్‌లో అంబేద్కర్‌కు నివాళులర్పించిన కేటీఆర్

తెలంగాణ భవన్‌లో అంబేద్కర్‌కు నివాళులర్పించిన కేటీఆర్

HYD: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల వారికి సమానమైన న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారని, గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.