VIDEO: యానాం గోదావరిలో దూకిన ఓ వ్యక్తి

VIDEO: యానాం గోదావరిలో దూకిన ఓ వ్యక్తి

కోనసీమ: యానాం ఎదురులంక బాలయోగి వారధి పై నుంచి గౌతమి గోదావరిలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం నుంచి ఫోన్లో మాట్లాడుతూ.. ఆవేదనగా కనిపించిన సదరు వ్యక్తి, మధ్యాహ్నం ఒక్కసారిగా నదిలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలంలో AP30EJ 4611 నెంబరు గల గ్లామర్ బైక్ లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.