స్వచ్ఛ గ్రామాల సాధనకు కృషి చేయాలి: ఎంపీడీఓ

BPT: కర్లపాలెం మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు శనివారం నల్లమోతువారిపాలెం, కర్లపాలెం, నందాయపాలెం గ్రామాలను సందర్శించారు. ఉదయాన్నే అక్కడికి చేరుకొని పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు ఇచ్చారు. చెత్త సేకరణలో నిమగ్నమైన వారిని అభినందించారు. స్వచ్ఛ గ్రామాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.