VIDEO: భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

CTR: పుంగనూరు టౌన్ శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, కర్పూర హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మాఘ స్నానాలు ఆచరించిన భక్తులు పరమేశ్వరుని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.