VIDEO: జిల్లాలో చిరుత కలకలం
నిజామాబాద్‌లో చిరుత కలకలం రేపింది. మాగి గ్రామ శివారులోని సైలానిబాబా దర్గా వద్ద నిజాంసాగర్-పిట్లం ప్రధాన రహదారిపై చిరుత దర్శనమిచ్చింది. చిరుత కనిపించడంతో మొబైల్‌లో రికార్డు చేసిన అదే మార్గంలో వెళ్తున్న లారీ డ్రైవర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చిరుత జాడను కనిపెట్టి, తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.