భైంసా ఆర్డీఓ కార్యాలయంలో పలువురికి బదిలీలు

ADB: సాధారణ బదిలీల్లో భాగంగా భైంసా ఆర్డీఓ కార్యాలయంలో పలువురు ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. డిటి శంకర్ నిర్మల్ లోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి, సీనియర్ అసిస్టెంట్ నాగనాథ్ బాసర ఎమ్మార్వో ఆఫీసుకు,జూనియర్ అసిస్టెంట్ సబాతబస్సుమ్ కుంటాల ఎమ్మార్వో కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.వారి స్థానంలో కలెక్టరేట్ నుంచి నాగజ్యోతి, ప్రవళిక బదిలీపై వచ్చారు.