8 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు

TPT: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన బ్రహ్మోత్సవాలు మే 8 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఈవో శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదగా గురువారం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లు విడుదల చేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.