ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. పోలీసులకు ఫిర్యాదు
MBNR: దేవరకద్ర ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో సంతకం ఫోర్జరీకి సంబంధించిన ఘటన కలకలం రేపుతోంది. జీనుగరాలకు చెందిన వెంకటేష్ యాదవ్ లోన్ కోసం ఓ డాక్యుమెంట్‌పై ఎమ్మార్వో దీపిక సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తప్పుడు సంతకాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు ఎమ్మార్వోకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.