VIDEO: పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రికత్త
MLG: ఏటూరునాగారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల్లోకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడంతో BRS శ్రేణులు అభ్యంతరాలు తెలిపారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల నాయకులను పోలింగ్ కేంద్రాల నుంచి పంపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండరాదని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.