ఎరువుల బుకింగ్ యాప్పై మండల స్థాయి సమీక్ష
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్పై మండల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. యూరియా విక్రయాలు పూర్తిగా బుకింగ్ యాప్ ద్వారానే జరగాలని, యూరియా వచ్చిన రోజు ఉదయం 9, మధ్యాహ్నం 12 లేదా సాయంత్రం 4 గంటలకు మాత్రమే ఆన్ లైన్‌లో బుకింగ్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కొత్త విధానం రైతుల సౌకర్యం కోసమే అమలు చేస్తున్నారు.