'నాణ్యమైన వైద్య సేవలు అందించాలి'
VSP: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అన్నారు. మంగళవారం ప్రాంతీయ కంటి ఆసుపత్రి, టీబీ అండ్ ఛాతీ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మందుల లభ్యత, సిబ్బంది హాజరు, శుభ్రత, వైద్య సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.