మార్కెట్ యార్డ్‌లో తడిసిన ధాన్యం

KNR: కరీంనగర్ మార్కెట్ యార్డ్‌లో అకాల వర్షాల కారణంగా ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు తెలిపారు. నిన్న రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ధాన్యంపై కప్పిన పరదాలు కొట్టుకుపోవడంతో తడిసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.