పనుల్లో వేగం పెంచండి: మంత్రి

NDL: బనగానపల్లె పాత బస్టాండ్ సమీపంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అలాగే బస్టాండ్ సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్థంభాల వలన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో వాటిని పక్కకు తరలించాలని సూచించారు.