ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల పురోగతి పరిశీలన
HYD: ట్రాఫిక్ DCP కాజల్ సింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి అగ్రసేన్ జంక్షన్‌ను సందర్శించారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు వేగవంతం చేస్తూనే, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ ఉండాలని ఆదేశించారు. విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి, నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.