గుడ్‌న్యూస్.. జర్మనీలో ఉద్యోగాలు
GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓమ్ కాప్, 2 కామ్స్ కన్సల్టింగ్ ప్రై.లి సంయుక్త ఆధ్వర్యంలో జర్మనీలో కమర్షియల్ వెహికల్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు మంగళవారం తెలిపారు. పురుష అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్ల మధ్య ఉండి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, విద్యార్హత కలిగి భారీ వాహనాల మెకానిక్ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు.