ఏప్రిల్ 2న గ్రామసభలను విజయవంతం చేయాలి :ఎంపీడీవో

ఏప్రిల్ 2న గ్రామసభలను విజయవంతం చేయాలి :ఎంపీడీవో

SRCL: ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతం చేయాలని ఎంపీడీవో రాదా అన్నారు. చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో పాటు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సభలో సీఎం సందేశాన్ని చదివి వినిపించాలన్నారు. వివిధ శాఖల ద్వారా అందుతున్న ముఖ్య పథకాలు, సాధించిన విజయాలపై సమాచారం అందించాలన్నారు.