తిరుపతిలో వ్యభిచార గృహంపై దాడి
తిరుపతి సత్యనారాయణపురంలో వ్యభిచార కేంద్రంపై గురువారం రాత్రి అలిపిరి సీఐ రామకిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఒక మహిళతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహం నుంచి ఒక బాలికను రక్షించి వైద్య పరీక్షలకు తరలించారు. నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.