మాజీ ముఖ్యమంత్రిని కలిసిన జిల్లా అధ్యక్షుడు

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన జిల్లా అధ్యక్షుడు

ప్రకాశం: తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ పలు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ లు కలిసి  జిల్లాలోని పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.