విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

SRCL: కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గుండెపోటుతో బడుగు కిరణ్ అనే యువకుడు మృతి చెందాడు. గురువారం ఉదయం ఒక్కసారిగా గుండెలో పట్టుకున్నట్లు అనిపించిందని చెప్పి కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.