భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన మాటూరు యువకుడు

భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన మాటూరు యువకుడు

NLG: త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన ధనావత్ వస్రం నాయక్ దివ్యాంగుల భారత క్రికెట్ జట్టుకి ఎంపిక అయ్యాడు. బోర్డ్ అఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (ఇండియా) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 నుంచి 20 తేదీ వరకు నేపాల్‌లో జరిగే మూడు టి 20, 2వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల సిరీస్‌లో ఇండియా తరఫున ఆడనున్నారు. ఈ సందర్భంగా పలువురు వస్త్రంకి శుభాకాంక్షలు తెలిపారు.