IND vs ENG: పాక్ సామర్థ్యంపై షెహ్‌బాద్ సెటైర్లు
T20 WC వాంఖడే సెమీస్‌లో భారత్ విసిరిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 246/7కే పరిమితమైంది. దీనిపై పాక్ మాజీ ప్లేయర్ అహ్మద్ షెహ్‌బాద్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ స్థానంలో పాక్ ఉన్నట్లయితే 225 పరుగులే చేయగలిగేదని సొంత జట్టు సామర్థ్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంకా తిలక్ వర్మ సమయానకూలంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు.