చివరి కార్తీక సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

 చివరి కార్తీక సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

NGKL: కార్తీక మాసంలో నేడు చివరి సోమవారం కావడంతో భక్తులు స్థానిక ఆలయాలకు పోటెత్తారు. జిల్లాలోని పలు శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి దేవాలయాలు హరిహరులనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూలతోపాటు పూజ సామాగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.