'లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి'

'లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి'

HNK: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ప్రావిణ్య ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి దశలో సొంత స్థలం ఉన్న అత్యంత నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయాలని వారికి సూచించారు.