కుటుంబ కలహాలు.. టవర్ ఎక్కిన యువకుడు
జయశంకర్ భూపాలపల్లి: మహాదేవపూర్ మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. కుటుంబసభ్యులతో డబ్బుల విషయంలో గొడవ తలేత్తడంతో యువకుడు టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్ధి చెప్పడంతో కిందకి దిగాడు. కాగా, ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.