ముందస్తు హార్వెస్టింగ్ వద్దు: ఆనం

ముందస్తు హార్వెస్టింగ్ వద్దు: ఆనం

NLR: యుద్ధం నేపథ్యంలో మత్స్యరంగంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. కల్చర్ సైకిల్ పూర్తికాకముందే ముందస్తుగా హార్వెస్టింగ్ చేయడంతో మార్కెట్లో సరఫరా పెరిగి రొయ్యల రేట్లు పడిపోతాయన్నారు. రైతులు అప్రమత్తమంగా ఉండాలని కోరారు.