మల్లాపూర్‌లో రోడ్డుపై పారుతున్న మురుగునీరు

మల్లాపూర్‌లో రోడ్డుపై పారుతున్న మురుగునీరు

HYD: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ, ఓల్డ్ విలేజ్ బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్‌లో మురుగు నీరు ఏరులై పారుతోందని స్థానికులు మండిపడుతున్నారు. మురుగు నీటి వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వారం, పది రోజులుగా మురుగు నీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.