VIDEO: అమలాపురంలో భారీ వర్షం

VIDEO: అమలాపురంలో భారీ వర్షం

కోనసీమ: అమలాపురం పట్టణంలో గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. భారీ ఈదురుగాలులకు కొబ్బరి చెట్ల ఆకులు రోడ్ల మీద చెల్లా చెదురుగా పడ్డాయి. పల్లపు రహదారులలో వర్షం నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.