VIDEO: గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా రక్షణ: డా: రవి
MHBD: భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.