'రేపు సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్'

AKP: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన అనకాపల్లిలో మాట్లాడుతూ.. వచ్చేనెల మూడవ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తామన్నారు.