హరీష్ రావును కలిసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే

WGL: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ ఈరోజు సిద్దిపేట MLA తన్నీరు హరీష్ రావుతో సమావేశమయ్యారు. మొన్న ఆదివారం జరిగిన BRS పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయ్యేందుకు కృషిచేసిన పెద్దిని హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి పెద్ది ఆయనతో చర్చించారు. BRS సభతో కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చిందన్నారు.