మద్యం సేవించి పోలీసులకు చిక్కిన లారీ డ్రైవర్

కృష్ణా: గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక లారీని అధికవేగంతో ప్రమాదకరంగా నడుపుతూ ఉండగా వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ గమనించి వెంటనే ఆపించారు. లారీ డ్రైవర్‌ను పరీక్షించగా మద్యం సేవించినట్లు స్పష్టమైంది. వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అధిక మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై గురువారం అతనిపై కేసు నమోదు చేశారు.