గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. అబుదాబిలోని జాయెద్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని దుబాయ్ విమానాశ్రయం ధృవీకరించింది. ఈ దాడిలో నలుగురు సిబ్బంది గాయపడినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఎయిర్‌పోర్టుకు స్వల్ప నష్టం వాటిల్లినట్లు ప్రకటించింది. దీంతో ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు పేర్కొంది.