'ప్రజాభిప్రాయం మెరకే ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేయాలి'

NDL: బేతంచర్ల ప్రజాభిప్రాయం మేరకే ఎయిర్ టెల్ సెల్ టవర్ నిర్మాణానికి మునిసిపల్ అధికారులు అనుమతి ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బేతంచెర్ల పట్టణంలోని డోన్ రహదారిలో గల వేబ్రిడ్జ్ ప్రక్కన ఎయిర్టెల్ నూతన టవర్ నిర్మాణం వల్ల రేడియేషన్ ప్రభావంతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని కావున తక్షణం నిర్మాణ పనులు నిలిపివేయాలని లేనిచో అడ్డుకుంటామని తెలిపారు.