ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన నాలుగు మండలాల ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఆ వినతులను సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.