నిర్ణీత గడువులో అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్
కర్నూలు జిల్లాలోని రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ సిరి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. PGRSలో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని అధికారులు నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. సీఎం కార్యాలయం నుంచి పీజీఆర్ఎస్ గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతున్నట్లు చెప్పారు.