నేడు జపాన్ రక్షణమంత్రితో రాజ్‌నాథ్ భేటీ

నేడు జపాన్ రక్షణమంత్రితో రాజ్‌నాథ్ భేటీ

న్యూఢిల్లీలో ఇవాళ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకతానితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతతో పాటు ద్వైపాక్షిక రక్షణ సహకారంపై చర్చిస్తారని రక్షణమంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. 2014 నుంచి భారత్-జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడింది. ఆరు నెలల్లోనే వీరిరువురు రెండోసారి భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.