ఉగ్రవాదానికి స్వర్గధామంగా పాక్: విక్రమ్ మిస్రీ

కశ్మీర్‌లో శాంతిని భగ్నం చేసేందుకు చేసిన కుట్రే పహల్గామ్ దాడి అని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కశ్మీర్‌లో అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగం అని తెలిపారు. TRF అనేది లష్కర్-ఇ-తోయిబాకు ఒక ముసుగు అని ఆరోపించారు. TRFపై నిషేధం తొలగించాలని పాక్ ఒత్తిడి చేసిందని చెప్పారు. ఉగ్రవాదానికి స్వర్గధామంగా పాక్ మారిందన్నారు.