గురుడ్ పేట్‌కి చెందిన వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
ASF: కౌటాలా పోలీస్ స్టేషన్ పరిధి గురుడ్ పేట్ గ్రామానికి చెందిన రామిల్ల కృష్ణమూర్తి అనే యువకుడు అదృశ్యం అయినట్లు SI డి. చంద్రశేఖర్ ఆదివారం ప్రకటన లో తెలిపారు. SI వివరాల ప్రకారం.. కృష్ణమూర్తి ఆగష్టు 4వ తేదీన రాత్రి సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదన్నారు. అతని తల్లి బాయక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.