వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు..!
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఆదివారం 1వ వార్డు కౌన్సిలర్ శ్రీరాములుతో కలిసి ఆయన వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల శుభ్రతపై చర్చించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మున్సిపల్ పాలకమండలి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.