'ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలి'

'ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలి'

PPM: పార్వతీపురంలోని వరహాల గెడ్డపై గల ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరహాల గెడ్డపై గల ప్రభుత్వ భూమిని కాపాడాలని గత ఆరు నెలలుగా కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని వివరించారు.