ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: కాకాణి

ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: కాకాణి

NLR: ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను వంచించి, సంక్షేమ పథకాలను అటకెక్కించిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి, ధాన్యం సేకరణలో వైఫల్యం చెందిందన్నారు. దీంతో రైతులు రోడ్ల మీదకు వస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుంటే, వైసీపీ తరఫున పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.