బెంగళూరు–మాల్డా టౌన్ మధ్య వారంతపు రైళ్లు

బెంగళూరు–మాల్డా టౌన్ మధ్య వారంతపు రైళ్లు

Vsp: హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు-మాల్డా టౌన్ మధ్య ప్రత్యేక వారపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మార్చి 1, 8వ తేదీలలో బెంగళూరులో బయలుదేరే ఈ రైలు, దువ్వాడ మీదుగా మాల్డా టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 4, 11 తేదీలలో మాల్డా టౌన్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకుంటుందని తెలిపారు.