చూస్తుండగానే కాలిపోయిన బైక్
NZB: ఇందల్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట బైక్ పూర్తిగా దగ్దమైంది. సిరికొండ మండలం న్యావనం గ్రామానికి చెందిన గోవింద్ బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో పక్కకి అపాడు. అతడు చూస్తుండగానే బైక్ కాలిపోయింది. అత్యవసరంగా వాహనాన్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.