'ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ భూములు సేఫ్'

'ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ భూములు సేఫ్'

నెల్లూరు రూరల్ లోని 30వ డివిజన్, ఏవీకే ఎస్టేట్ నందు పార్కును టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా, 26 డివిజన్లలో 18 ఎకరాల విస్తీర్ణం, రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ. 7 కోట్ల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడనున్నట్లు తెలిపారు.