పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకూడదు: నాగరాణి
సత్యసాయి: గోరంట్ల మండలం ముద్దకుంటపల్లి గ్రామంలో ICDS ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో పిల్లల పోషణ, అంగన్వాడీ సేవలపై అవగాహన కల్పించారు. పంకుడి పోర్టల్ ద్వారా అంగన్వాడీలకు సమాజ సహకారం అందించవచ్చని నాగరాణి వివరించారు. పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని, జంక్ ఫుడ్ నివారించాలని సూచించారు.