గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
WGL: సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగరాజుపల్లి SRSP కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.సుమారు 30-35 ఏళ్ల వయస్సు,ఐదు అడుగుల ఎత్తు కలిగిన ఈ మహిళ ఎల్లో పంజాబీ డ్రెస్సు, రెడ్ ప్యాంట్ ధరించి, మెడపై నల్లటి మచ్చలు ఉన్నాయి. సమాచారం తెలిసిన వారు స్థానిక పోలీసు స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.