అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్న పోలీసులు

MNCl: చెన్నూర్ పట్టణ శివారులో గల నేషనల్ హైవే 63 పై అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో చెన్నూర్ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లూరు ఇసుక క్వారీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నలారీని సీజ్ చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.