ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి
KRNL: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని, పెద్దకడబూరులో డీవైఎఫ్ఎ, ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భగత్ సింగ్ రాజుగురు, సుఖదేవ్ల త్యాగాలు యువతకు స్పూర్తిదాయకమని, సమాజంలో సమానత్వం కోసం యువత ముందుకు రావాలని సూచించారు.